పూజా హెగ్దేకి సైట్ సీయింగ్‌కి వెళ్లినప్పుడు అక్కడి అందమైన లొకేషన్స్‌ని తన అందాలతో కలిపి కెమెరాలో బంధించడమంటే చాలా ఇష్టం. అఫ్కోర్స్ అందరికీ ఇష్టమేననుకోండి. ఈ వైట్ లాంగ్ ఫ్రాక్‌లో అందాల పూజా హెగ్దే అందాన్ని పొగడడం చాలా కష్టమే. ఆమె కాస్ట్యూమ్‌కి తగ్గట్లుగా చుట్టూ గ్రీనరీ. అందాల నెమలి పురి విప్పి నాట్యం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది కదూ. ఈ మధ్యే ఈ ముద్దుగుమ్మ 'డీజె' సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. బాలీవుడ్ నుండి మళ్లీ అమ్మడికి ఆఫర్స్ వస్తున్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ గుసగుసల సంగతి పక్కన పెట్టేసి, ఇప్పటికి ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌ని కళ్లారా చూసి ఆస్వాదించండి.