'గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా..' అంటూ అందమైన స్టెప్పులతో ఆకట్టుకుంది 'ముకుందా' సినిమాలో పూజా హెగ్దే. తొలి సినిమాకే మంచి విజయం అందుకుంది. హీరోయిన్‌గా స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. తర్వాత కొంచెం స్లో అయినా ఇప్పుడు పూజా కెరీర్ టాప్ మోస్ట్‌లో రన్ అవుతుందని చెప్పొచ్చు. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ, మరో వైపు స్పెషల్ సాంగ్స్‌కీ బెస్ట్ అండ్ నెంబర్ వన్ ఆప్షన్‌గా మారింది.
'రంగస్థలం'లో జిగేల్ రాణీ పాటకు పూజా చిందేసిన తీరూ, ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టేసిన తీరుకు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కీ పూజానే ప్రిఫర్ చేస్తున్నారట. అయితే ప్రస్తుతం పూజా హెగ్దే ఎన్టీఆర్, ప్రబాస్, మహేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా సీటు కన్‌ఫామ్ చేసుకుంది. ఇదిదే, అదదే అన్నట్లుగా పూజా కెరీర్ రాకెట్ స్పీడుతో దూస్కెళ్లిపోతోంది.
ఈ నెల 25న పూజా హెగ్దే 'సాక్ష్యం' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, హాట్ పిక్స్‌తో కుర్రకారుకు కాక రేపుతోంది. ఈ బేబీ పింక్ మోడ్రన్ వేర్‌లో పూజా అందం చూసే కొద్దీ చూడబుద్దేస్తోంది కదా.