చరణ్ - బోయపాటి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బోయపాటి ఎప్పుడో స్క్రిప్ట్ రెడీ చేశాడు. అంటే చరణ్ 'రంగస్థలం' సినిమా చేయకముందేనన్న మాట. అయితే 'రంగస్థలం' రికార్డులతో ఈ సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్‌లో బోయపాటి శీను కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందట. దీనికంతటికీ 'రంగస్థలం' ఎఫెక్టే రీజన్ అని చెప్పొచ్చు. సాధారణంగా బోయపాటి సినిమాల్లో సీరియస్ టోన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హీరో క్యారెక్టర్‌ని పవర్‌ఫుల్‌గా మాస్ ఆడియన్స్‌కి ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
అయితే 'రంగస్థలం'లోని చరణ్ టాలెంట్ చూశాక, ఆ సీరియస్ టోన్‌ని కాస్త తగ్గించాడట బోయపాటి. బోయపాటి గత చిత్రమైన 'జయ జానకి నాయకా' చిత్రంలో ఈ సీరియస్ టోన్ ఎక్కువైన కారణంగానే ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందనే టాక్ ఉంది. అందుకే అలాంటి తప్పులు ఈ సినిమాలో దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. సరదా సరదాగా సాగుతూనే, మాస్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసే ఏ ఎలిమెంట్స్‌నీ మిస్ కాకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడట బోయపాటి.
ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. చరణ్ లేకుండా కొన్ని సీన్స్ చిత్రీకరణ జరిపారు. లేటెస్టుగా చరణ్ కూడా షూటింగ్‌కి అటెండ్ అయ్యాడు. ఔట్‌పుట్ చాలా బాగా వస్తోందట. 'రాజవంశస్థుడు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా 'భరత్' బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది.