కరోనా మహమ్మారి లేకపోతే ఈపాటికి వేడివేడి వేసవి.. సినిమాల సందడితో మెరిసిపోయేది. కానీ కరోనా వచ్చి ప్రపంచాన్ని భయపెట్టేసింది. ఇప్పుడు ప్రపంచమంతా ఇల్లు అనే పంజరంలో బంధీ అయిపోయింది. దీనికి ఎవ్వరూ అతీతం కాదు. ఐతే సెలబ్రెటీ హోదాతో అభిమానులని సంపాయించుకున్న తారలు మాత్రం ఎదో రకంగా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్నారు. దీనికి సోషల్ మీడియా వేదిక అయ్యింది. వంటలు చేయడం, వర్క్ ఔట్స్ చేయడం, యోగాలు ..ఇలా ఎవరికీ తోచిన పోస్టులతో యంగేజ్ చేస్తున్నారు.
ఇలాంటి ఓ ప్రయత్నమే చేసింది ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఓ సెల్ఫీ పోస్ట్ చేసింది. మామూలు సెల్ఫీ కాదిది. వెరీ హాట్. చిన్న టాప్, అంతకంటే చిన్న నిక్కరు.. ఇదీ పూజా లుక్. పోస్ట్ చేసిన నిమిషంలోనే కరోనాలా వైరల్ అయ్యింది ఈ పిక్. ఇప్పుడు పూజా చేతిలో బడా సినిమాలు వున్నాయి. ప్రభాస్ తో చేస్తున్న సినిమా సెట్స్ పై వుంది. అలాగే సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా సైన్ చేసింది. ఒక్కసారి ఈ లాక్ డౌన్ ఎత్తేస్తే.. పూజా వెండితెర సందడి మొదలైపోతుంది. అందాక ఇలా సోషల్ మీడియా సందడితో సరిపెట్టుకోవాలి ఫాన్స్.