పూజాహెగ్డె లుక్ కి ఫిదా అయిన అభిమానులు.!

మరిన్ని వార్తలు

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ల‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే సినిమా అభిమానులు నుంచి సాధ‌ర‌ణ ప్రేక్ష‌కులు వ‌ర‌కు విప‌రీత‌మైన పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రేండింగ్ అవ్వ‌డం ఈ సినిమాకి మీద ఉన్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాకి సంభందించి మెద‌టి స్టెప్ అంటూ విడ‌దుల చేసిన అఖిల్ అక్కినేని లుక్ కి మంచి రెస్పాన్స్ రావ‌టం విశేషం.. ఇప్ప‌డు సెకండ్ స్టెప్ అని హీరోయిన్ పూజా హెగ్డే లుక్ ని విడుదల చేశారు.

 

ఇలా స్టెప్స్ అంటూ ఆడియన్స్ లో ఫ్యాన్స్ లో ఈ చిత్రం పై క్యూరియాసిటి మరింత పెంచుతున్నారు. ఈ రెండు లుక్ లు ఇటు మీడియాలో అటు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో వుండ‌టం ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నా తెలియ‌జేస్తుంది. అఖిల్ అక్కినేని ఒక ప్ర‌త్యేఖ ఇమేజ్ ని త‌న సోంతం చేస‌కుంటున్నారు. ఈ సినిమా త‌న కెరీర్ బెస్ట్ కానుంది. బొమ్మ‌రిల్లు చిత్రం విడుద‌ల‌య్యి ఇన్ని సంవ‌త్స‌రాల‌యినా కూడా ఇప్ప‌టికి బొమ్మ‌రిల్లు చిత్రం లోని సంభాష‌ణ‌లు కాని, స‌న్నివేశాలు కాని డిస్క‌ష‌న్ లో వున్నాయంటే ఆ సినిమా క్రియెట్ చేసిన ట్రెండ్ అలాంటిది.. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ కొంత గ్యాప్ త‌రువాత మ‌రోక్క‌సారి ప‌ది సంవ‌త్స‌రాలు మాట్లాడుకునేలా చిత్ర క‌ధ కుదిరింద‌ని చిత్ర యూనిట్ అంటున్నారు.

 

అదే విధంగా భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీత గొవిందం, ప్ర‌తిరోజు పండ‌గే చిత్రాల‌తో కెరీర్ బెస్ట్ గ్రాస‌ర్ గా రికార్డు విజ‌యాల్ని అందించిన బ‌న్ని వాసు ఈ చిత్రాన్ని ప్ర‌త్యేఖంగా శ్ర‌ధ్ధ తీసుకుంటున్నారు. సంగీతం గొపి సుంద‌ర్ అందించారు, ఈ ఆడియో ని అతి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ లో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS