అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె. అందాల పోటీల్లో సత్తా చాటి, సినిమాల్లో రాణిస్తోన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసు కదా? 'ముకుంద' సినిమాలో వరుణ్ తేజ సరసన కన్పించి, 'ఒక లైలా కోసం' అంటూ నాగచైతన్యతో ఆడిపాడిన ఈ బ్యూటీ, ఇటీవల అల్లు అర్జున్‌తో 'డిజె' సినిమాలో హాట్ హాట్‌గా అందాల్ని ఆరబోసేసింది. త్వరలో 'సాక్ష్యం' సినిమాతో ప్రేక్షకుల్ని మరోమారు తన మాయలో పడేయాలనుకుంటోన్న పూజా హెగ్దే, ఫెమినా బ్యూటీ అవార్డ్స్ కోసం ఇదిగో, ఇలా వెరైటీ లుక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి అందానికి, పెర్ఫెక్ట్ డెపినిషన్ పూజా హెగ్దేనే. అందుకే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పూజా హెగ్దే గ్లామరస్ ప్రకంపనలు గట్టిగానే విన్పిస్తున్నాయి. 'రంగస్థలం' సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేసినా, వరుస అవకాశాలు కొల్లగొడ్తున్నా పూజా హెగ్దే స్టయిలే వేరు. ఇంకొక్క కమర్షియల్ హిట్ సరైనది పడితే చాలు, పూజా హెగ్దే టాలీవుడ్లో టాప్ హీరోయిన్ అయిపోతుంది.