ఇటీవల రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్ ఫర్ రామ్’ వీడియో రిలీజ్ చేసి సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేశారు. అయితే, ఈ రోజు అనగా శ్రీరామ నవమి సందర్భంగా మరో అప్‌డేట్ ఇవ్వాలనుకున్నారట. కానీ, కుదరలేదు. అంతేకాదు, ఈ రోజు అజయ్ దేవగణ్ పుట్టినరోజు కావడంతో, ఆయన బర్త్‌డే గిఫ్ట్‌గా ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. అయితే, ఆ అప్‌డేట్‌కి సంబంధించిన వర్క్ పూర్తి కాకపోవడంతో మిస్ అయ్యిందట.
ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ నుండి అజయ్ దేవగణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ఓ పోస్ట్ పెట్టింది. ‘మంచి మనసు గల అజయ్‌దేవగణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఫస్ట్ షెడ్యూల్‌లోనే మీతో కలిసి పని చేయడం మాకు మరిచిపోలేని అనుభవం. మీరు కూడా అలాగే ఫీలవుతున్నారని భావిస్తున్నాం. మా ప్రాజెక్ట్‌లో మీరూ ఓ భాగం కావడాన్ని గర్వంగా ఫీలవుతున్నాం.. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల కారణంగా మీ ఫస్ట్‌లుక్ వీడియో రిలీజ్ చేయలేకపోతున్నాం. కానీ లాక్‌డౌన్ పూర్తి కాగానే, మిమ్మల్ని కొత్త అప్‌డేట్‌తో ఎంగేజ్ చేస్తాం..’ అని ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ట్విట్టర్‌లో పేర్కొంది. అలా ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుండి రావల్సిన మరో ఫ్రెష్ అప్‌డేట్ మిస్ అయిందన్న మాట.
Happy birthday to the man with an immense heart, @AjayDevgn! Sir, it's the greatest honour to have you as part of team #RRRMovie. Working on the first schedule with you was an unforgettable experience and we hope it was the same for you. Have another phenomenal year ahead :)
— RRR Movie (@RRRMovie) April 2, 2020