ఆ ఒక్క‌మాట‌తో.. పూజాని తెగ ఆడేసుకున్నారు

మరిన్ని వార్తలు

సెల‌బ్రెటీలు ఏం మాట్లాడాల్సివచ్చినా ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచించుకోవాల్సిందే. ఏమాత్రం తేడా వ‌చ్చినా.. సోష‌ల్ మీడియాలో తెగ ఆడేసుకుంటారు. పూజా హెగ్డేకి ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. ఓ ఇంట‌ర్వ్యూలో ద‌క్షిణాది ప్రేక్షకుల అభిరుచి విష‌యంలో కొన్ని వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు న‌డుం, నాభి చూపించే దృశ్యాలంటే తెగ ఇష్ట‌మ‌ని పేర్కొంది. దాంతో.. సోష‌ల్ మీడియాలో... పూజాని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇష్టం లేక‌పోతే.. అలాంటి స‌న్నివేశాల్లో న‌టించ‌డం మానేయ్‌.. అంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దాంతో పూజా.. మ‌ళ్లీ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సివ‌చ్చింది. త‌న‌కి ద‌క్షిణాది అంటే ఇష్ట‌మ‌ని, ప్రాణ‌స‌మాన‌మ‌ని, ఇలాంటి ఇండ్ర‌స్ట్రీ గురించి తానెప్పుడూ త‌ప్పుగా మాట్లాడ‌న‌ని, త‌న వ్యాఖ్య‌ల్ని వ‌క్రీక‌రించార‌ని వాపోయింది.

 

``నేను ఒక ఇంట‌ర్వ్యూలో అన్న మాట‌ల్ని వేరే సంద‌ర్భానికి అన్వ‌యిస్తున్నారు. అక్ష‌రాల్ని మార్చ‌గ‌ల‌రేమో గానీ, అభిమానాన్ని కాదు. నాకు ఎప్ప‌టికీ తెలుగు చిత్ర‌సీమ ప్రాణ స‌మానం. ఇది నా చిత్రాల‌ను అభిమానించే వాళ్ల‌కు తెలిసినా, ఎటువంటి అపార్థాల‌కూ తావివ్వ‌కూడ‌ద‌ని నేను మ‌ళ్లీ చెబుతున్నా. నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండ్ర‌స్ట్రీకి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను`` అంటూ సందేశం పంపింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS