మా 'ముద్దు' పాట్లు మీకేం తెలుసంటోన్న ముద్దుగుమ్మ.!

మరిన్ని వార్తలు

ఒకప్పుడు సినిమాల్లో ముద్దు సీన్లంటే మ్యాజికల్‌ మూమెంట్సే. ముద్దు పెట్టుకుంటున్నట్లుగా బిల్డప్‌ ఇచ్చేసి, స్క్రీన్‌ని రొమాంటిక్‌గా పువ్వులు, పళ్లతో కవర్‌ చేసేసేవారు. లేదంటే, కెమెరా ట్రిక్స్‌ యూజ్‌ చేసేవారు. చాలా అరుదుగా మాత్రమే అప్పట్లో ముద్దు సీన్లుండేవి. కానీ, ట్రెండ్‌ మారిందిప్పుడు. ముద్దు సీన్‌ లేనిదే సినిమా ఉండడం లేదు. ఒక్క సీన్‌ కాదు, చిన్న సినిమాలైతే కేవలం మూతి ముద్దుల పైనే బేస్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ మధ్య హీరోలు, హీరోయిన్లు ఈ ముద్దు సీన్ల గురించి తమదైన స్టైల్‌లో రెస్పాండ్‌ అవుతూ, ఆసక్తి కలిగిస్తున్నారు.

 

మొన్నామధ్య హీరో వరుణ్‌ తేజ్‌ ముద్దు సీన్‌ విషయంలో ఒకలా రెస్పాండ్‌ అయితే, తాజాగా ఆయన హీరోయిన్‌ పూజా హెగ్దే మరోలా స్పందించింది. ముద్దు సీన్లలో నటించేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుందని చెబుతోంది. ముద్దు సీన్‌ పర్సనల్‌గా ఏమీ ఉండదనీ, చుట్టూ చాలా మంది ఉంటారనీ, అంత మంది మధ్య ముద్దు సీన్‌లో నటించడమంటే, చాలా భయం వేస్తుందనీ ఆ భయాన్ని ముఖంలో తెలియకుండా, హీరోతో ఫిజిక్స్‌, కెమిస్ట్రీలు పండించాలంటోంది. స్క్రీన్‌పై తన తొలి ముద్దు ఎక్స్‌పీరియన్స్‌ బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో జరిగిందనీ పూజా చెప్పుకొచ్చింది.

 

బాలీవుడ్‌లో 'మొహంజోదారో' సినిమాతో పూజా హెగ్దే హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో 'ముకుందా' సినిమాలో ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ 'మొహంజోదారో' సినిమాలో తన హాట్‌ హాట్‌ అందాలతో బీభత్సం చేసేసింది. అయితే, దురదృష్టవశాత్తూ, ఆ సినిమా నెగిటివ్‌ రిజల్ట్‌ ఇచ్చింది పూజా హెగ్దేకి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS