ఆదమరచీ.. అందాలారేసి.!

మరిన్ని వార్తలు

'ముకుందా' సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ పూజా హెగ్దే, 'డీజె' సినిమాతో హాట్‌ బ్యూటీ ట్యాగ్‌ని తగిలించేసుకుంది. బికినీతో పిచ్చెక్కించేసింది ఈ సినిమాతో. ఇక్కడితో ఆగలేదీ అందాల భామ. సోషల్‌ మీడియాలోనూ ఈ మధ్య బికినీ సోయగాలతో కుర్రకారుకు కిర్రాకు పుట్టించేసింది. ఆ మైకం నుండి ఇంకా తేరుకోకుండానే ఇదిగో మళ్లీ ఇలా తన గ్లామర్‌ దాడి మొదలెట్టేసింది. చూస్తున్నారుగా, స్కిన్‌ కలర్‌ ఇన్నర్‌ వేర్‌లో క్లీవేజ్‌ని ఆదమరపుగా ప్రదర్శనకు పెట్టేసింది. ఆమె ఆదమరపు మాట అటుంచితే, పూజా హెగ్దేని అలా చూస్తూ, తమని తామే మైమర్చిపోతోంది యూత్‌. ఇక సినిమాల విషయానికి వస్తే, స్టార్‌ హీరోలందరికీ ఇప్పుడు బెస్ట్‌ ఆప్షన్‌ పూజా హెగ్దేనే. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత..'లో పూజా హీరోయిన్‌గా నటిస్తోంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌తో నటిస్తున్న సినిమా ప్రస్తుతం డెహ్రాడూన్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. బెల్లంకొండతో పూజా నటించిన 'సాక్ష్యం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రబాస్‌తో ఓ సినిమాకి సైన్‌ చేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS