అందాల రాశీ ఇకపై అలా కనిపించదా.?

మరిన్ని వార్తలు

కొంచెం బొద్దుగా ముద్దుగా ఉండే రాశీఖన్నా తర్వాత తర్వాత కొంచెం సన్నబడి స్లిమ్‌గా తయారయ్యింది. అయితే మొదట్లో గ్లామరస్‌ పాత్రలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి ఈ మధ్య క్యాజువల్‌ పాత్రలే వస్తున్నాయి. గ్లామర్‌ యాంగిల్‌ పెద్దగా చూపించే అవకాశం రావట్లేదు. సక్సెస్‌ వచ్చినా, గ్లామరస్‌ లుక్స్‌కి పూర్తిగా దూరమైందనే చెప్పాల్సి వస్తోంది. 

మొన్నీమధ్య మెగా ప్రిన్స్‌తో 'తొలిప్రేమ' సినిమాతో మంచి విజయం తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో క్యాజువల్‌ వేర్‌లో ట్రెండీ అమ్మాయిగా కనిపించింది. కానీ ఎక్కడా హద్దులు మీరిన గ్లామర్‌ ప్రదర్శించలేదు. అలాగే తాజా సినిమా 'శ్రీనివాస కళ్యాణం'లో కూడా రాశీఖన్నా ట్రెడిషనల్‌ అండ్‌ జస్ట్‌ మోడ్రన్‌ వేర్‌లోనే కనిపిస్తుందట. ఇప్పటి వరకూ అయితే ప్రమోషన్స్‌లో భాగంగా రాశీఖన్నా ట్రెడిషనల్‌ వేర్‌లోనే దర్శనమిచ్చింది. ఇక సినిమాలో కూడా అలాగే ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. 

ఆ కోవలోనే ఇకపై రాశీఖన్నా గ్లామర్‌కి దూరమైనట్లే అనే ఫైనల్‌ అంచనాకి వచ్చేశారు. చూడాలి మరి సినిమా విడుదలయ్యాక రాశీఖన్నా ఎలాంటి షాక్‌లు ఇస్తుందో. సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నితిన్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే రాశీఖన్నా ఓ తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. తొలి సినిమాకే థ్రిల్లర్‌ మూవీతో వచ్చి, అక్కడి తమిళ తంబీలను బెదరగొట్టేసేలా ఉంది రాశీఖన్నా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS