'అరవింద సమేత'తో ఇటీవలే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ పూజా హెగ్దే సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నించి వార్తల్లో హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి ఆమె స్ట్రెయిట్‌గా మోడీని ప్రశ్నించలేదు. మరో హీరోయిన్ దియా మీర్జా ప్రశ్నించింది. దియా మీర్జా ట్వీట్‌పై పూజాహెగ్దే స్పందించింది. అసలు విషయం ఏంటంటే బాలీవుడ్ సినీ ప్రముఖులతో ప్రధాన నరేంద్రమోడీ భేటీ అయ్యారు.
సినీ పరిశ్రమకు సంబంధించి పలు సమస్యలపై చర్చించారు. అయితే మోడీతో భేటీ అయిన సినీ ప్రముఖుల బృందంలో ఒక్క మహిళ కూడా లేరు. ఇలా ఎందుకు జరిగింది. మహిళలు అవసరం లేదా.? వారి సమస్యలు మీకు పట్టవా.? అంటూ స్ట్రెయిట్‌గా మోడీనే ప్రశ్నిస్తున్నారు సినీ పరిశ్రమకు చెందిన మహిళా ప్రముఖులు. నిజమే మరి. సినీ పరిశ్రమలో మహిళలు అన్ని విభాగాల్లోనూ దూసుకెళ్తున్నారు. స్టార్ హీరోల్ని మించి, హీరోయిన్లు సత్తా చాటుతున్నారు. నిర్మాణం, దర్శకత్వం విభాగాల్లోనూ రాణిస్తున్నారు.
సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ ప్రధాని మోడీ తనను కలిసిన సినీ ప్రముఖుల బృందంలో మహిళలు లేకపోవడాన్ని ఎలా అనమతించారో. ఇదే విషయాన్ని పూజాహెగ్దేలాంటి వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించినందుకు వీరికి సాటి మహిళల నుండి మద్దతు లభిస్తోంటే, కొందరు మాత్రం వీరిని ట్రాలింగ్ చేస్తున్నారు.