తెలుగు నాట టాప్ హీరోయిన్లు ఎవరంటే.. రష్మిక మండన్నా, పూజా హెగ్డేల పేర్లే చెబుతారు. వీరిద్దరూ.. ఒకటి, రెండు స్థానాలను ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్నది కూడా వీళ్లే. ఇప్పుడు వీరిద్దరూ ఒకే సినిమాలో కలసి నటించబోతున్నారు.
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. తెలులు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఓ కథానాయికగా రష్మిక ఇది వరకే ఎంపికైంది. రెండో కథానాయికగా పూజా హెగ్డే ఖరారైంది. ఈ విషయాన్ని పూజా సైతం ధృవీకరించింది. ప్రస్తుతం రాధేశ్యామ్ లో నటిస్తోంది పూజా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం అఖిల్ తో జత కట్టింది. వీటి తరవాత... పూజా చేయబోయే సినిమా ఇదే.
ALSO SEE :
Rashmika Latest Photoshoot