పూజాహెగ్దే స్పెషల్‌ ఏంటో తెలుసా?

మరిన్ని వార్తలు

'ముకుందా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ పూజాహెగ్దే. తొలి సినిమాకే హిట్‌తో పాటు, సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌కెళ్లినా, మళ్లీ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అనిపించుకుంటోంది. ఫస్ట్‌ మోస్ట్‌ త్వరలో 'మహర్షి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తర్వాత ప్రబాస్‌ - రాధాకృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమాలో నటిస్తోంది. ఆల్రెడీ సినిమా రెండు షెడ్యూల్స్‌ కంప్లీట్‌ చేసుకుందట.

 

ఇకపోతే స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలోనూ పూజాహెగ్దేనే హీరోయిన్‌. దీంతో పాటు వరుణ్‌తేజ్‌తో 'వాల్మీకి' కోసం కూడా పూజా పేరు పరిశీలనలో ఉంది. ఇవన్నీ కాక మరిన్ని ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులు పూజా కోసం ఎదురు చూస్తున్నాయట. ఇదిలా ఉంటే, అన్నింటికీ మించి ప్రస్తుతం 'మహర్షి' ప్రమోషన్స్‌లో పూజాహెగ్దే చాలా యాక్టివ్‌గా పాల్గొంటోంది. తనదైన హుందాతనంతో ఆకట్టుకుంటోంది కూడా. ఇకపోతే ఈ సందర్భంగా ఆమెలోని కొన్ని స్పెషల్‌ టాలెంట్స్‌ బయటికొస్తున్నాయి.

 

ఇప్పటికే తెలుగులో మాట్లాడేందుకు తన వంతు ప్రయత్నిస్తోంది. తెలుగు మాటలన్నింటినీ చక్కగా అర్ధం చేసేసుకుంటోంది. ఇదంతా ఒకెత్తు అయితే, ఆమెలో ఓ మంచి సింగర్‌ దాగుందన్న విషయం ప్రేక్షకులకు తెలియాల్సిందే. ఎప్పుడో కెరీర్‌ మొదట్లో నటించిన 'ముకుందా' సినిమాలోని 'గోపికమ్మా చాలునులేమ్మా..' అనే పాటను అలవోకగా పాడి వినిపించేస్తోంది. తెలుగు రాని పూజాహెగ్దే, ఆ పాటలోని లిరిక్స్‌ని గుర్తు పెట్టుకోవడం రిధమిక్‌గా పాడడం చూస్తుంటే, ఆమెని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఆమె గాత్రం కూడా కోకిల గాత్రంలా ఉండడంతో, త్వరలో ఏ దర్శకుడైనా పూజాహెగ్దేతో ఓ పాట పాడించేసే రిస్క్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS