మెగా హీరోల్లో తనదైన ప్రత్యేక గుర్తింపు, ముద్ర లేకుండానే ఏదో అరకొర సినిమాలతో, విజయాలతో నెట్టుకొస్తున్నాడు అల్లు శిరీష్. తన తాజా చిత్రం `ఏబీసీడీ` పూర్తయినా, ఇంత వరకూ విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా రీషూట్ల మీద రీషూట్లు జరుపుకొంటోందని, అందుకే ఆసల్యం అవుతోందని టాక్. అలాంటి సినిమాకి విడుదలకు ముందే శాటిలైట్ అమ్ముడుపోవడం, అది కూడా శిరీష్ కెరీర్‌లోనే అత్యధిక ధర పలకడం నిజంగా పరిశ్రమ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది.
జీ తెలుగు `ఏబీసీడీ` శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ని రూ.5 కోట్లకు దక్కించుకుంది. శిరీష్ కెరీర్‌లోనే ఇది రికార్డు అనుకోవొచ్చు. శాటిలైట్, డిజిటల్ ద్వారా దాదాపు 75 శాతం రికవరీ వచ్చేసినట్టే అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నిజంగా అల్లు శిరీష్‌కు అంత సీన్ ఉందా? లేదంటే.. కేవలం ఈ సినిమా హైప్ కోసం ఇలాంటి ప్రచారం మొదలెట్టారా? అనే అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి. అల్లు శిరీష్ కెరీర్ లో ఏకైక హిట్‌గా నిలిచిన శ్రీరస్తు - శుభమస్తు కూడా ఈ స్థాయిలో అమ్ముడుపోలేదు. అలాంటిది వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకి అంత క్రేజ్ ఏమిటో..?? ఈ అంకెలలో మర్మం ఏమిటో? ఆ సినిమా తీసిన వాళ్లకే తెలియాలి.