'అల వైకుంఠపురములో..' సినిమాకి గ్లామర్ పుష్కలంగా ఉన్న సంగతి తెలిసిందే. 'అత్తారింటికి దారేది' సినిమాకి ఏమాత్రం తక్కువ కాకుండా ఈ సినిమాలోనూ గ్లామర్‌ని పొందుపరిచాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సీనియర్ నటి టబుతో పాటు, హీరోయిన్ పూజా హెగ్దే, మరో హీరోయిన్ నివేదా పేతురాజ్.. ఇలా ఇప్పటికే ఫుల్ గ్లామర్ డోస్ ఉన్న ఈ సినిమాకి ఐటెం సాంగ్‌తో మరింత గ్లామర్ అద్దనున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్ ఉండబోతోందని టాక్ వినిపించింది కానీ, అధికారిక క్లారిటీ అయితే లేదు. ఇదిలా ఉంటే, ఇంతమంది గ్లామర్ పాపలున్నారు కానీ, ఎవరెవరు.. ఏయే పాత్రలు పోషిస్తున్నారన్నది మాత్రం తెలియ రావల్సి వుంది. మరోలా ఉంటే, తాజాగా పూజా హెగ్దే చేయబోయే పాత్ర రివీల్ అయ్యింది. అయితే లీకు వీరుల ద్వారా లీకైన ముచ్చట కానే కాదిది. స్వయంగా పూజా హెగ్దేనే తన పాత్రను రివీల్ చేసింది.
ఈ సినిమాలో ఓ కార్పొరేట్ సంస్థలో బన్నీ, నేను ఎంప్లాయ్స్‌గా పని చేస్తున్నామనీ, బన్నీకి నేనే బాస్ అనీ పూజా చెప్పింది. 'సామజవరగమన..' లిరికల్ సాంగ్‌లో ఆల్రెడీ ఆ విషయం నిరూపించేలా వారి స్టిల్స్ కనిపించిన సంగతి తెలిసిందే. ఇక అందర్నీ ఆసక్తి కలిగించే అంశం మాత్రం టబు పాత్ర ఏమై ఉంటుందా.? అనేదే. ఆ పాత్ర ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. చూడాలి మరి, టబు పాత్ర ఎలా ఉండబోతోందో. ఇంకో హీరోయిన్ నివేదా పేతురాజ్ పాత్ర కూడా తెలియాల్సి ఉంది.