సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే మహేష్ బాబు ఇటీవల 65వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న విశ్వనటుడు కమల్ హాసన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మహేష్ ట్వీట్‌కి లేటెస్ట్‌గా స్పందించిన కమల్ హాసన్, మీ విషెస్‌ని నేను మనస్పూర్తిగా స్వీకరిస్తున్నా.. మీరు కూడా నాలాగే, చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్‌గా ఎదిగారు. మీకు ఎప్పుడూ శుభం కలగాలని ఆశిస్తున్నా.. అంటూ మహేష్‌కి ధన్యవాదాలు తెలుపుతూ కమల్ ట్వీట్ చేశారు. కమల్ ట్వీట్‌కి మహేష్ మీ ప్రేమాభిమానాలు ఇలాగే ఎప్పుడూ నాపై ఉండాలంటూ మహేష్ రీ ట్వీట్ చేశారు. ఇద్దరు స్టార్ హీరోలు ఇలా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుకుంటే, ఇరు వర్గాల ఫ్యాన్స్ ఆనందంతో మురిసిపోయారు.
ప్రస్తుతం కమల్ హాసన్ 'ఇండియన్ 2' చిత్రంలో నటిస్తున్నారు. ఓ వైపు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే, మరోవైపు సినిమాలపైనా దృష్టి పెట్టి బిజీగా గడుపుతున్నారు కమల్. మహేష్ 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మికా మండన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.