అందాల భామ పూజా హెగ్దే కొత్త ‘పాఠం’ నేర్చుకుంటోందట. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి. దాంతో, ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది సెలబ్రిటీలకి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు ఇంట్లోనే రకరకాల కొత్త ప్రయోగాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. హీరోయిన్లు, హీరోలు, ఇతర సెలబ్రిటీలు వంటింటి యోధుల్లా మారిపోతున్న విషయం విదితమే. అదొక్కటే కాదు, వర్కవుట్స్ చేస్తున్నారు.. ఆ విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక, పూజా హెగ్దే అయితే కొత్త టాలెంట్‌ని సొంతం చేసుకునే పనిలో బిజీగా వుందట. పూజా హెగ్దేకి పాటలు పాడటం అంటే ఇష్టం. సంగీతం ఇంకా ఇంకా ఇష్టం. దాంతో, గిటార్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యిందట. నిజానికి ఎప్పటినుంచో గిటార్ మీద మోజు వున్నా, ఇప్పుడు సమయం దొరకడంతో ఎక్కువ టైమ్ దాంతోనే గడిపేస్తోందట. ఇంటర్నెట్‌లోకి తొంగి చూస్తే.. గిటార్ వాయించడం ఒక్కటేనా, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎలాగూ గిటార్‌లో కొంత టచ్ వుంది గనుక, తన టాలెంట్‌కి మరింత పదును పెడుతోందట. లాక్‌డౌన్ పూర్తయ్యేలోపు గిటార్‌లో సత్తా చాటేయాలనుకుంటున్నట్టుంది పూజా హెగ్దే. అన్నట్టు, పూజా హెగ్దే తయారు చేస్తోన్న రెసిపీస్, పూజా హెగ్దే చూపిస్తోన్న యోగాసనాలు ఇప్పటికే బోల్డంత పాపులర్ అయిన విషయం విదితమే. కరోనా ఓ పక్క భయపెడ్తున్నా, పూజా హెగ్దే కూల్ పోస్ట్‌లు అభిమానులకి బోల్డంత కిక్ ఇచ్చేస్తున్నాయి.