మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా పూజా హెగ్దే ఇటే టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ కూడా దూసుకెళ్లిపోతోంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో టాప్ ఛైర్‌కి అడుగుల దూరంలో మాత్రమే ఉంది. స్టార్ హీరోల సరసన అవకాశాలతో పాటు, యంగ్ హీరోస్‌కీ తానే ఆప్షన్ అవుతోంది. క్రేజీయెస్ట్ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోన్న పూజా హెగ్దే కాస్త రిలాక్స్ అవ్వడానికి షూటింగ్ నుండి చిన్న బ్రేక్ తీసుకుందట. ఆ బ్రేక్‌ని వెకేషన్‌తో ఎంజాయ్ చేస్తోంది. విదేశాల్లో విహరిస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో షికారు చేస్తున్న పూజా హెగ్దే అక్కడ అందమైన లొకేషన్స్‌లో దిగిన ఫోటోలు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.
నెట్టింట్లో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఎంజాయ్‌మెంట్‌ని తమ ఎంజాయ్‌మెంట్‌గా భావిస్తూ, ఫ్యాన్స్ కూడా రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు. అంత లైవ్ క్యాప్చర్‌గా ఉన్నాయి పూజా హెగ్దే పిక్స్. ఈ సంక్రాంతికి పూజా హెగ్దే అల్లు అర్జున్‌తో కలిసి 'అల వైకుంఠపురములో..' సినిమాతో రాబోతోంది. ప్రమోషన్స్ కోసం కూడా ప్రత్యేకంగా టైమ్ కేటాయించిందట పూజా హెగ్దే. ఈ సినిమాని మొదట్నుంచీ చాలా ఇన్నోవేటివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. ప్రతీ ప్రమోషన్ సూపర్ హిట్ అవుతోంది. రిలీజ్ దగ్గర పడేకొలదీ, ఆ జోరు మరింత పెంచనున్నారట. ముఖ్యంగా ప్రమోషన్స్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో పూజా హెగ్దే హైలైట్‌గా నిలవనుందట. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.