'ఖైదీ'తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్‌కి కాసుల పంట పండించిన హీరో కార్తి, మరోసారి తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడు. అన్ సీజన్ అయిన డిశంబర్‌లో ఇప్పటికే టాలీవుడ్ నుండి పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆ రేస్‌లో స్టార్ హీరో బాలయ్య కూడా తన 'రూలర్'తో సిద్ధంగా ఉన్నారు. డిశంబర్ 20న 'రూలర్' రిలీజ్ కానుంది. దాంతో పాటు, రోజుల గ్యాప్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే' అంటూ వచ్చేస్తున్నాడు. ఆ మధ్యలోనే ఎక్కడో అక్కడ అడ్జెట్ అవ్వడానికి 'వెంకీ మామ' లైన్‌లో ఉన్నాడు. వీరితో పాటు, నేనేం తక్కువ అన్నట్లు తమిళ హీరో కార్తి మళ్లీ వస్తున్నాడు.
తాజా అప్‌డేట్ ప్రకారం ఆయన నటించిన 'తంబి' చిత్రం డిశంబర్ 20న రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కార్తికి అక్క పాత్రలో ఆయన రియల్ లైఫ్ వదినమ్మ జ్యోతిక నటిస్తోంది. వదినా మరిదిల కాంబినేషన్‌లో పండే ఈ సెంటిమెంటల్ అండ్ డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టోరీ ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను టచ్ చేస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అంతేకాదు, 'ఖైదీ'తో కార్తికి వచ్చిన క్రేజ్‌ని మళ్లీ ఇలా 'తంబీ'తో క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు కాబోలు. చూడాలి మరి, 'ఖైదీ' మ్యాజిక్, 'తంబి' రిపీట్ చేస్తాడో.? లేదో.?