‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్‌ని ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి, ప్రస్తుతం తన తొలి సినిమా డైరెక్టర్‌తోనే వర్క్ చేస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లవ్‌స్టోర్’లో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, సాయి పల్లవి ఖాతాలో మరో కొత్త ప్రాజెక్ట్ చేరినట్లు తాజాగా ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. కథలోని ఫీలింగ్స్ ఆడియన్స్ మనసుకు హత్తుకునేలా సినిమాలు తెరకెక్కించే టాలెంట్ ఉన్న కిషోర్ తిరుమల డైరెక్షన్ లిస్టులో ఉన్న ఓ సినిమాకి సాయి పల్లవి హీరోయిన్గా పరిశీలనకొచ్చిందని తెలుస్తోంది.
ప్రస్తుతం కిషోర్ తిరుమల ‘రెడ్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ - మాళవికా శర్మ జంటగా నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా సమ్మర్ రిలీజ్‌కి ముస్తాబవుతోంది. ఈ సినిమా తర్వాత శర్వానంద్‌తో ఓ కథని ఎప్పుడో లైన్లో పెట్టేశాడట కిషోర్ తిరుమల. ఆ కథలో హీరోయిన్గా సాయి పల్లవిని అనుకుంటున్నారట. గతంలో ‘పడి పడి లేచె మనసు’ సినిమాలో సాయి పల్లవి,` శర్వానంద్ జంట ఆడియన్స్‌ని ఎలా మెస్మరైజ్ చేసిందో తెలిసిన సంగతే.
ఒకవేళ తిరుమల సెట్ చేసిన కాంబో ఓకే అయితే, మరోసారి ఈ జంట ఆన్ స్క్రీన్ అప్పియరెన్స్‌తో ఆడియన్స్‌ని మాయ చేయనుందన్న మాటే. మరోవైపు శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ అనే మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. డేట్ ఫిక్స్ కాలేదు కానీ, ఈ మూవీ కూడా సమ్మర్ రేస్లోకే దూసుకొస్తోంది. ఇక కిషోర్ తిరుమల కొత్త ప్రాజెక్ట్ జూన్‌లో పట్టాలెక్కనుందన్న సమాచారం ఉంది.