బిగ్‌హౌస్‌లో సెగలు పుట్టిస్తున్న పూజా

మరిన్ని వార్తలు

బుల్లితెర రియాల్లీ షో 'బిగ్‌బాస్‌' హౌస్‌లోకి పూజా రామచంద్రన్‌ ఎంట్రీతో కొత్త గ్లామర్‌ యాడ్‌ అయ్యింది. వస్తూ వస్తూనే ఈ ముద్దుగుమ్మ తన హాట్‌ హాట్‌ అందాలతో సెగలు హౌస్‌మేట్స్‌తో పాటు, బిగ్‌బాస్‌ వీక్షకులకు కూడా సెగలు పుట్టించింది. 

బిగ్‌బాస్‌ పూజాకి సెపరేట్‌గా టాస్క్‌లిస్తున్నారు. ఆల్రెడీ హౌస్‌లో గత 40 రోజులుగా ఉన్న కంటెస్టెంట్స్‌ తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఫోన్‌లో మాట్లాడే అవకాశం కల్పించారు. బిగ్‌బాస్‌. అలా వారు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కావాల్సిన ఫోన్‌ రీఛార్జ్‌ కోసం పూజాకి టాస్క్‌లు ఇచ్చారు. 

మొదటి టాస్క్‌గా పేడలో చేతులు పెట్టి కాయిన్స్‌ కలెక్ట్‌ చేయడమనే టాస్క్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసింది పూజా హెగ్దే. అలాగే రెండో టాస్క్‌గా స్విమ్మింగ్‌ పూల్‌ని ఎంచుకున్నారు. స్విమ్మింగ్‌ పూల్‌లో పూజా అందచందాలు చూసి వీక్షకులే కాదు, హౌస్‌ మేట్స్‌ కూడా అవాక్కయ్యారు. ఇలా ఇచ్చిన టాస్క్‌లను మొదట్లోనే పూజా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసేస్తోంది. అలాగే బిగ్‌బాస్‌ హ్యాండ్‌సమ్‌ అండ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ కౌషల్‌తో పోటీపడి కసరత్తులు కూడా చేసేస్తోందీ ముద్దుగుమ్మ. 

ఇలా పూజా రాకతో బిగ్‌హౌస్‌లో కొత్త గ్లామర్‌ వాతావరణం నెలకొంది. 'స్వామి రారా' చిత్రంలో తన అప్పియరెన్స్‌తో సినిమాకి కొత్త కళను తెచ్చి పెట్టిన పూజా రామచంద్రన్‌ ఇప్పుడు బుల్లితెరపై కూడా అదే గ్లామర్‌తో దూసుకెళ్లిపోతోంది. చూడాలి మరి ముందు ముందు తన ఆటిట్యూడ్‌ బిగ్‌హౌస్‌లో ఎలా ఉండబోతోందో. తనీష్‌ కెప్టెన్సీలో ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌ రన్‌ అవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS