మాఫియా పైన చిత్రాలని తీయడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్న ఆర్జీవీ మరోసారి తనకి నచ్చిన, కలిసొచ్చిన మాఫియా పైనే దృష్టిపెట్టబోతున్నాడు.
అయితే ఈ సారి ఆయన సినిమా కాకుండా ఇప్పటి ట్రెండ్ ప్రకారం వెబ్ సిరీస్ ని తీయబోతున్నాడు. దానికి టైటిల్ “D కంపెనీ” అని కూడా పెట్టేశాడు. ఇక ఆర్జీవీ స్వయంగా తన వెబ్ సిరీస్ గురించి కొద్దిసేపటి క్రితం పేస్ బుక్, ట్విట్టర్ లలో “ D కంపెనీ” గురించి చెప్పుకొచ్చాడు.
తను చేయబోయే వెబ్ సిరీస్ లో “D కంపెనీ వ్యవస్థాపకుడైన దావూద్ ఇబ్రహీం గురించే కాకుండా ఆయన సృష్టించిన మాఫియా, దానికి వెనుక ఉన్న కారణాలు అదే సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేత, ముంబై పెళ్లుళ్ళు వంటి ముఖ్య ఘటనలు” ఇందులో చూపుతాడట.
ఈ వెబ్ సిరీస్ మొత్తం 5 సీజన్లు లో ఉండనుంది, ఒక్కో సీజన్ లో 10 ఎపిసోడ్స్ ఉంటాయి అని తెలుస్తుంది.
ఇక ఈ వెబ్ సిరీస్ ని ప్రముఖ నిర్మాత మధు మంతెన నిర్మించనున్నారు. త్వరలోనే ఇందులో నటించే నటీనటుల గురించిన సమాచారం తెలియనుంది.