బిగ్ బాస్ సీజన్ 2 దాదాపు ఆఖరి వారాలలోకి వచ్చేసింది. దీనితో ఇంటిలోని స్ట్రాంగ్ అనబడే సభ్యులు కూడా ఇంటిని వీడే సమయం వచ్చేసింది.
ఇందులో భాగంగానే ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో ఉన్నది- కౌశల్, తనీష్, పూజ రామచంద్రన్ & దీప్తి. అయితే కౌశల్, దీప్తి లకి ఇప్పటికే సోషల్ మీడియాలో తగినంత క్రేజ్ ఉండడంతో ఈ ఇరువురికి పెద్ద ఇబ్బంది ఉండదు అన్న అంచనా వ్యక్తమవుతున్నది.
ఇక మిగిలిన ఇద్దరు – పూజ రామచంద్రన్ & తనీష్ లలో ఎవరో ఒకరు ఈరోజు ఇంటిని వీడే అవకాశం ఉందంటూ ఇప్పటికే అంచనాలు, ఊహాగానాలు మొదలైపోయాయి. వీరిరువురిలో కూడా పూజ రామచంద్రన్ కే రిస్క్ ఎక్కువగా ఉందంటూ అంతర్జాలంలో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
అయితే ఏదైనా జరగోచ్చు అనే ట్యాగ్ లైన్ ఉన్న బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు రాత్రి ఎవరు వెళ్ళిపోతారు అన్నది మనకి రాత్రికే తెలియనుంది.