టాక్ అఫ్ ది వీక్- నీవెవరో & ఆటగాళ్ళు

మరిన్ని వార్తలు

ఈ వారం పేక్షకుల ముందుకి నాలుగు చిత్రాలు వచ్చాయి. అందులో రెండు చిత్రాలు మాత్రం ప్రేక్షకుల దృష్టిని తమవైపుకి తిప్పుకోగలిగాయి. ఆ రెండు చిత్రాలు ఏంటంటే- నీవెవరో & ఆటగాళ్ళు.

ముందుగా నీవెవరో గురించి మాట్లాడుకుంటే- థ్రిల్లింగ్ & సస్పెన్స్ అంశాలు పుష్కలంగా చూపించగలిగే కథని తీసుకున్నా అది తెరకెక్కించే సమయంలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఈ చిత్రం సరైన విధంగా రూపుదిద్దికోలేదు. ఆది, తాప్సీ, రితిక వంటి మంచి నటులు పెట్టుకున్నాక వారిని మంచి కథనంతో ముందుకి నడిపించే ఉంటే ఈ చిత్రం కచ్చితంగా విజయవంతం అయి ఉండేది.

కథనంలో లోపాల వల్ల సినిమాలోని మలుపులు సరైన పద్దతిలో ప్రేక్షకులకి చూపించలేకపోయారు. తమిళంలో విజయవంతమైన సినిమా నుండి స్ఫూర్తి తీసుకుని ఈ చిత్రం తీసినప్పటికి ఆ తమిళ చిత్రం సాధించిన విజయాన్ని మాత్రం ఇక్కడ పునరావృతం చేయలేకపోయారు.

 

ఇక రెండవ చిత్రం అయిన ఆటగాళ్ళు గురించి చెప్పుకుంటే- ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఇందులో రెండు ప్రాధాన పాత్రలకి జగపతిబాబు & నారా రోహిత్ లని తీసుకొని దర్శకుడు మంచి పనే చేసినా వారి మధ్య సాగే మైండ్ గేమ్ ని ఆకట్టుకునే విధంగా తీయడంలో విఫలమయ్యాడు.

 

ఇటువంటి చిత్రాలలో అనవసరమైన అంశాలు చేరిస్తే థ్రిల్లర్ కాస్త చప్పబడిపోతుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. కమర్షియల్ అంశాలు కథనంలో జొప్పించడంతో ఈ సినిమా గాడి తప్పింది.

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS