పూనమ్ కౌర్ అరుదైన వ్యాధికి గురైంది. ఫైబ్రోమైయాల్జీయా వ్యాధితో పూనమ్ కౌర్ బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. నిద్రలేమి, కండరాల నొప్పులు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మ సంబంధిత సమస్యలు ఫైబ్రోమైయాల్జీయా వ్యాధి లక్షణాలు.
పూనమ్ కౌర్ కు ఈ వ్యాధి ఉన్నట్లు నవంబర్ 18న నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆమె... తాజాగా కేరళలోని ఓ ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ప ప్రస్తుతం పూనమ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పూనమ్... తెలుగు, తమిళ, మలయాళంలో దాదాపు 35కుపైగా చిత్రాల్లో నటించింది. పూనమ్ ఓ వివాదంలో వార్తల్లో కూడా నిలిచింది. తాను ఓ దర్శకుడి వల్ల మోసపోయినట్టు ఆరోపణలు చేసింది. అలాగే రాజకీయలకు సంబధించిన తన అభిప్రాయాలని కూడా వెల్లడిస్తుంటుంది పూనమ్.