హీరోయిన్ పూనమ్ కౌర్, చేసిన సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాల్లో కన్పించడంలేదు. అయితే, ఆమె పేరుతో వివాదాలు మాత్రం తెరపైకొస్తున్నాయి. వీటిల్లో చాలావరకు ఆమెకు సంబంధం లేని వివాదాలే కావడం గమనార్హం. ఆమె, ఏదన్నా విషయమ్మీద తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొడితే, ఆమె మాటలకు సంబంధం లేని వ్యక్తుల్ని, ఆమె మాటలకు లింక్ చేసి పుకార్లు పుట్టించడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది.
ఇదిలా వుంటే, ‘జల్సా’ సినిమా టైమ్ లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తలెత్తిన వివాదం.. అంటూ చాలా ఏళ్ళుగా ఓ గాసిప్ ప్రచారంలోకి వస్తూనే వుంది. ఆ వివాదంపై ఎట్టకేలకు పూనమ్ కౌర్ వివరణ ఇచ్చింది. త్రివిక్రమ్ తో తనకు విభేదాల్లేవని తేల్చేసింది. అంతే, ఇప్పటికి ఈ పుకార్ల పరంపరకు ఫుల్స్టాప్ పడ్డట్లయ్యింది. ఇక, పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇంకా పాత గాసిప్స్ ఎప్పటికప్పుడు కొత్తగా తెరపైకొస్తూనే వున్నాయి. మరి, వీటికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందోగానీ, ఆమె మాత్రం పలు సందర్భాల్లో ఆ గాసిప్స్‌ని కొట్టి పారేయడమే కాదు, ఘాటుగానే హెచ్చరికలు జారీ చేసింది.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది దుష్ప్రచారం చేస్తున్నవారరిపై.