పోసాని కృష్ణమురళి పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యాల్లో సెంట్రాఫ్ పాయింట్ `పంజాబీ అమ్మాయి`నే. ఓ పంజాబీ అమ్మాయి ఎన్నో ఆశలతో టాలీవుడ్ లోకి అడుగు పెడితే, ఓ ప్రబుద్ధుడు మోసం చేసి, కడుపు చేశాడని, తనని మానసికంగా క్షోభకు గురి చేశాడని, దాన్ని కప్పి పుచ్చుకునేందుకు రూ.5 కోట్లు ఇచ్చాడని, ఈ విషయంలో పవన్ న్యాయం చేయాలని, పోసాని ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మరో ప్రెస్‌మీట్లో.. `కడుపు చేసింది నువ్వే` అంటూ మరో బాణం వదిలారు. వ్యాఖ్యలు, అందులో నిజానిజాలు ఏమైనా పంజాబీ అమ్మాయి ఎవరు? అనే పాయింట్ పై చర్చ నడుస్తోంది. ఈ దశలో పూనమ్ కౌర్ చేసిన ట్వీట్లు ఆసక్తిని పెంచుతున్నాయి. అన్నట్టు పూనమ్ కూడా పంజాబ్ నుంచి వచ్చిన అమ్మాయే.
`చిత్ర పరిశ్రమలో ఏకైక గురువు దాసరిగారు అని, ఆయన్ను మిస్ అయ్యా`` అంటూ పూనమ్ ఓ ట్వీట్ చేసింది. రౌడీ దర్బార్ చిత్రంలోని ఇంద్రలోకం పార్టీ ... చంద్రలోకం పార్టీ ... మీ జెండాలకు వేల వేల దండాలయా...మీ పార్టీల్లో గూండాలను చేర్చకండయా అనే పాట వీడియోను పోస్ట్ చేసింది. దీన్ని బట్టి పూనమ్ ఏదో చెప్పాలనుకుంటోందన్నది మాత్రం అర్థమైంది. అయితే ఆ గుండాలెవరో, ఆ పార్టీ ఏమిటో క్లారిటీ లేదు. గతంలో కూడా పవన్ - కత్తి మహేష్ వివాదంలో పూనమ్ ఇన్వాల్వ్ అయ్యింది. ఈసారి పోసాని వ్యవహారంలోనూ ఏదో చెప్పాలనుకుంటోంది. మరి అదేమిటన్నది తనకైనా తెలుసా, లేదా? అనేదే ప్రశ్న.