అక్షరాల్లో 'హాట్‌' సెన్సేషన్‌

By iQlikMovies - April 25, 2018 - 08:00 AM IST

మరిన్ని వార్తలు

హాట్‌ హాట్‌ ఫోటో సెషన్‌తో పూనమ్‌పాండే సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడే సెన్సేషన్‌ అవుతూ ఉంటుంది. అయితే ఈ సారి సరికొత్త హాట్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది ఈ బ్యూటీ. అదేంటంటే, ఎట్టకేలకు మన పూనమ్‌ పాండే సెక్సప్పీల్‌కి దేవుడు వరమందించినట్లున్నాడండోయ్‌. అమ్మడికి సినిమా అవకాశం తెచ్చిపెట్టేశాడు. పూనమ్‌ పాండే ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా టైటిల్‌ కోసం సోషల్‌ మీడియా అభిమానులకు ఓ పజిల్‌ విసిరింది. బ్యాక్‌ గ్రౌండ్‌లో ఎప్పటిలానే తన హాట్‌ అప్పీల్‌ ఇస్తూనే, కొన్ని లెటర్స్‌ రిలీజ్‌ చేసింది. ఆ లెటర్స్‌ని హింట్‌గా తీసుకుని తన సినిమా టైటిల్‌ ఏంటో చెప్పమంటోంది. ఇంతకీ ఆ హాట్‌ హాట్‌ లెటర్స్‌ ఏంటంటారా? 'ఏ' ఒకటి, 'ఆర్‌' ఒకటి. ఇంకెందుకాలస్యం, వీటితో ఈ సెక్సీ బ్యూటీ నటించబోయే హాట్‌ హాట్‌ మూవీ టైటిల్‌ని చెప్పుకోండి చూద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS