హాట్‌ బ్యూటీకి క్యాప్షన్‌ ఇచ్చుకోండి!

By iQlikMovies - November 08, 2018 - 10:57 AM IST

మరిన్ని వార్తలు

పూనమ్‌ పాండే అంటే సోషల్‌ మీడియాలో ఓ సంచలనం. అలాంటిలాంటి సంచలనం కాదు, జుగుప్సాకరమైన సంచలనం. అయినాగానీ, ఈమె సోషల్‌ మీడియా వేదికగా ఆ 'జుగుప్స'ని కొనసాగిస్తూనే వుంటుంది. అప్పుడప్పుడూ అందమైన ఫొటోలు పెడుతూ, ఎప్పుడూ జుగుప్సాకరమైన రీతిలో అందాల ఆరబోత చేసేస్తుంటుంది. అందుకే ఈ బ్యూటీకి వచ్చే కామెంట్స్‌ ఇంకా వల్గర్‌గా వుంటాయి. అయినా సరే, వెనక్కి తగ్గేదే లేదంటూ ఎప్పటికప్పుడు సరికొత్త ఫొటోలతో కుర్రకారుకి కిర్రాకు పుట్టించేయడం పూనమ్‌ పాండేకి అలవాటే మరి. తాజాగా ఇదిగో ఈ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, 'క్యాప్షన్‌' ప్లీజ్‌.. అంటూ కుర్రాళ్ళను రెచ్చగొట్టింది. ఊరుకుంటారా? రెచ్చిపోయారంతే. అందులో బూతులు కూడా వున్నాయి లెండి. అడిగి మరీ బూతులు తిట్టించుకోవడంలో ఏం ఆనందం వుంటుందో పూనమ్‌ పాండేకే తెలియాలి. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో 'లేడీ గబ్బర్‌ సింగ్‌' సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS