'బాత్ టబ్‌లో స్నానం అంటే చాలా ఇష్టం. అందులోనూ బాత్‌టబ్‌లో స్నానం చేస్తూ వైన్ తాగడంలో వచ్చే కిక్కే వేరప్పా..! అంటోంది బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే. సోషల్ మీడియాలో సెక్స్ బాంబ్ అని పేరు తెచ్చుకున్న ఈ భామ, వీలు చిక్కినప్పుడల్లా హాట్ ఫోటోస్‌తో హీట్ పెంచేస్తూ ఉంటుంది.
'గుడ్ గాళ్ 'అంటూ హాట్ హాట్ ఫోటోస్‌ని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిందీ బ్యూటీ. టూ పీస్ బికినీ పైన ట్రాన్స్‌పరెంట్ టాప్ ధరించి వయ్యారాలు పోతోంది. చూస్కున్నోళ్లకు చూసుకున్నంత అన్నట్లుగా అందాల ఆరబోతతో రెచ్చిపోవడం పూనమ్ పాండేకి అలవాటే. ఇండియా 'వరల్డ్ కప్ గెలిస్తే మైదానంలో నగ్నంగా నడుస్తా..' అని ప్రకటించి పాపులర్ అయిన పూనమ్ పాండే ఆ తర్వాత మాట తప్పింది. అప్పటి నుండి ఇప్పటి దాకా ఏదో ఒకరకంగా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూనే ఉంది. ఆ స్టంట్స్ ఆమెకు సినీ అవకాశాలు తెచ్చిపెట్టకపోయినా, ఏదోలా ఆమెని పాపులర్‌ని చేస్తున్నాయ్.
ట్విట్టర్‌లో ఈవిడగారి సెక్సప్పీల్‌ని తట్టుకోలేక ఫోటోస్‌ని హైడ్ చేసేసిన సందర్భాలూ ఉన్నాయి. 'దిస్ మీడియా మే కంటైన్ సెన్సిటివ్ మెటీరియల్' అని కన్పిస్తూ ఉంటుంది కొన్ని ఫోటోస్ కింద. దాంతో సోషల్ మీడియాలో ఈ వయ్యారి పప్పులుడకట్లేదనీ ఓ స్పెషల్ యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది. తెలుగులో ఓ సినిమాకి సైన్ చేసింది కానీ ఏమైందో తెలీదు. హాట్‌నెస్ ఒక్కటే కాదు ఈ బ్యూటీలో. సేవా కార్యక్రమాల పట్ల కూడా కొంచెం యాక్టివ్‌గానే ఉంటుంది. ఆ యాంగిల్‌లో ఈ ముద్దుగుమ్మని 'గుడ్‌గాళ్' అనుకోవచ్చునేమో!