'గౌరవం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన క్యూట్ బ్యూటీ యామీ గౌతమ్, ఆ తర్వాత తెలుగులో చేసిన ఇంకో సినిమా 'కొరియర్ బాయ్ కళ్యాణ్'. ఈ రెండూ తెలుగులో అంతగా విజయం సాధించలేకపోయాయి. అయితే బాలీవుడ్లో మాత్రం యామీ గౌతమ్‌కి మంచి సక్సెస్‌లే ఉన్నాయి. అందులో 'విక్కీ డోనర్' ఒకటైతే, ఇంకోటి 'కాబిల్'.
వీటితోపాటు మరికొన్ని సక్సెస్‌లూ బాలీవుడ్లో తన ఖాతాలో వేసుకున్నా, యామీ కొంచెం హోమ్లీ టైప్ బ్యూటీ అనే గుర్తింపు తప్ప హాటెస్ట్ బ్యూటీ అనే పేరైతే తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఇమేజ్ మేకోవర్‌లో భాగంగా 'మేగ్జిమ్' మ్యాగజైన్ కోసం బికీనీలతో ఫొటోలకు పోజులిచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది యామీ గౌతమ్. మేగ్జిమ్లో మేగ్జిమమ్ గ్లామర్‌తో యామీ గౌతమ్ కన్పిస్తోంటే, ఆమె గ్లామర్ సునామీలో కుర్రకారు తమ హృదయాలు కొట్టుకుపోతున్నాయనే అంటున్నారు. ఈ బికినీలో యామీని చూస్తే, అలా అనని కుర్రకారు కన్పిస్తారా? ఇమేజ్ మేకోవర్ అనేది కేవలం స్టైలిష్ అప్రోచ్ మాత్రమేనని, అందులో యాటిట్యూడ్ కనిపిస్తుంది తప్ప వల్గారిటీ ఉండదని యామీ గౌతమ్ చెబుతోంది.
ఇది పాత మాటే. చాలామంది సుందరాంగులు చెప్పేశారు. పైకి ఏం చెప్పినా, చెయ్యాలనుకున్న ఎక్స్పోజింగ్ ఓవర్‌డోస్‌లో చేసేసి, 'నేను ఇదీ చెయ్యగలను' అని నిరూపించేసుకుంది ఈ హాట్ బ్యూటీ. ఒకే ఒక్క ఫొటో సెషన్‌తో తన సెక్సప్పీల్ పండించి, హాట్ బ్యూటీస్ రేసులో తానూ ఉన్నానంటూ హాట్ మెసేజ్ పంపేసింది. ఏదేమైనా ఈ యామీ సునామీ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవ్వాలో అంతకన్నా ఎక్కువే వైరల్ అయ్యిందండోయ్.