ఎవ‌రో ఆ `సుంద‌రీ`!!

మరిన్ని వార్తలు

`అవును` లాంటి చిత్రాల‌తో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తాను కూడా ఓ మంచి ప్ర‌త్యామ్నాయం అని నిరూపించుకుంది పూర్ణ‌. కానీ.. ఆ త‌ర‌వాత‌.. తాను కోరుకున్న క‌థ‌లు త‌న వ‌ర‌కూ రాలేదు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా హిట్ వ‌రించ‌లేదు. దాంతో... సినిమాల ప‌రంగా కొంత గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా `సుంద‌రి` అనే సినిమా తెర‌కెక్కుతోంది.

 

క‌ల్యాణ్ జీ గోగ‌న ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. అర్జున్ అంబ‌టి కీల‌క పాత్ర‌ధారి. ఈరోజే ప్రీ లుక్ కూడా విడుద‌ల చేశారు. లుక్ చూస్తే.. నాట్య ప్ర‌ధానంగా సాగే క‌థ అని తెలుస్తోంది. ఓ అమాయకురాలు తీసుకున్న ఓ నిర్ణ‌యం చుట్టూ ఈ క‌థ తిరుగుతుంద‌ని, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చామ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. అయితే కాస్త హార‌ర్‌, ఇంకాస్త స‌స్పెన్స్ కూడా ఈ క‌థ‌లో మిళిత‌మైన‌ట్టు స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS