అమెరికాలో బుక్‌ అయిన ఆ హీరోయిన్‌ ఎవరు?

By iQlikMovies - June 15, 2018 - 15:45 PM IST

మరిన్ని వార్తలు

ఓ తెలుగు జంట అమెరికాలో నీచానికి ఒడికట్టింది. సినిమా హీరోయిన్స్‌ని రప్పించి, వారితో, సెక్స్‌ ట్రేడ్‌ జరిపింది. అమెరికన్‌ పోలీసులు ఆ తెలుగు జంటను అరెస్ట్‌ చేశారు. సెక్స్‌ ట్రేడ్‌కి సంబంధించి ఆధారాలు సేకరించారు. విచారణలో షాకింగ్‌ విషయాలు తెలిశాయి. 

హీరోయిన్స్‌ని సెక్స్‌ ట్రేడ్‌ కోసం అక్రమ మార్గాల్లో రప్పించడమే కాక, వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసి, అడ్డగోలుగా సెక్స్‌ట్రేడ్‌ని సంపాదించారు. దురదృష్టవశాత్తూ, ఈ సెక్స్‌ ట్రేడ్‌లో ప్రధాన నిందితుడికి తెలుగు సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలున్నాయి. కొన్ని సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. ఇంకా దారుణం ఏంటంటే, ఆయన భార్య కూడా ఈ సెక్స్‌ ట్రేడ్‌కి సహకరించడం. 

ఖండాంతరాలు దాటి అమెరికా వెళ్లి మన జాతి గౌరవాన్ని నిలబెట్టాల్సింది పోయి, పరువు తీసేశారు ఈ ఇద్దరూ. అయినా దొరికేదాకా ఎవరైనా దొరలే. ఇదిలా ఉంటే, ఈ సెక్స్‌ట్రేడ్‌కి సహకరించిన హీరోయిన్స్‌ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినిమాల్లో నటించిన ఓ కన్నడ హీరోయిన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 

మరో అప్‌కమింగ్‌ హీరోయిన్‌, చేతిలో అవకాశాలు భారీగా ఉన్న ఇంకో హీరోయిన్‌ కూడా ఈ వివాదంలో ఇరుక్కున్నారనీ సమాచారమ్‌. అయితే ఈ కేసులో హీరోయిన్లను బాధితులుగానే గుర్తించాల్సి ఉంటుంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS