కొరటాల పై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని..!

మరిన్ని వార్తలు

నటుడు, మాటల రచయిత అయిన పోసాని కృష్ణ మురళి శైలి వెండి తెరపై అయినా, నిజ జీవితంలో అయినా ఒకేలా ఉంటుంది. ఏదైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, ఏ సందర్భానైనా నవ్వు తెప్పించటం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆయన తెరపై కనిపిస్తే చాలు మనకి నవ్వు వచ్చేస్తుంది.

నిన్న జరిగిన 'భరత్ అనే నేను' సక్సెస్ మీట్ లో ఎప్పటిలాగే తనదైన శైలి లో మాట్లాడిన పోసాని, కడుపుబ్బా నవ్వించడమే కాకుండా కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా మీడియాతో పంచుకున్నారు.

'భరత్ అనే నేను' ఇంత పెద్ద సక్సెస్ అయిందని మనందరికీ తెలుసు. ఇప్పుడు నేనేమన్నా మాట్లాడితే నా మేనల్లుడు కొరటాల శివ గురించే మాట్లాడాలి. చిన్నప్పటి నుండే వాడికి మంచి టేస్ట్ ఉండేది. వాడిని ఎత్తుకుని తిరిగా.. నా పెళ్ళి చూపులకి కూడా వాడిని తీసుకుని వెళ్ళా. అమ్మాయిని చూసి బయటికి వచ్చాక ఎలావుందని అడిగా. వెంటనే బాగుందని వాడు చెప్పాడు. ఒట్టు, వాడు చెప్పినట్టు ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకున్నా. సగం వీడిపై నమ్మకం, సగం నా పెళ్ళాం పై నమ్మకం.

కొరటాల శివ కి కూడా మహేష్ బాబు లాగే 'మాటలు తక్కువ.. చేతలు ఎక్కువ' అన్నాడు. పోసాని మాటలు విని అక్కడ ఉన్నవారంతా కడుపుబ్బా నవ్వుతూ ఎంజాయ్ చేసారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS