'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఫ్రీ రిలీజ్ బిజినెస్

By iQlikMovies - April 29, 2018 - 19:16 PM IST

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం నా పేరు సూర్య. ఇంతక ముందు చాలా సినిమాలకు స్టోరీ రైటర్ గా పనిచేసిన వక్కంతం వంశీ తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో బన్నీ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ఇంపాక్ట్ (రిలీజ్) చేసారు. ఈ టీజర్ తో బన్నీ పాత్ర ఏమిటో తెలిసిపోయింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోవడంతో, ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది.

ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ 77.65 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలో(ఏపీ, తెలంగాణ) 61.95 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా (తమిళ్ కర్ణాటక నార్త్) 8.50, ఓవర్సీస్ లో 7.2 కోట్లకు అమ్ముడైంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS