పోసాని కృష్ణ మురళి ఇంటిపై బుధవారం అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళ దాడి చేశారు. ఎల్లా రెడ్డి గూడలో వున్నా పోసాని ఇంటి పై రాళ్ళు విసిరారు. దీనిపై కాలనీ సూపర్ వైజర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఐతే దాడి జరిగినప్పటినుంచి పోసాని కనిపించడలేదని కధనాలు వసున్నాయి. ఈ రోజు పోసానికి కొన్ని షూటింగులు వున్నాయి. కొంతమందితో కాంబినేషన్ షాట్లు వున్నాయి. పోసాని కోసం సదరు నిర్మాతలు సంప్రదించగా ఆయన ఫోన్ కలవడం లేదు. ఆయన ఎక్కడ వున్నారో కూడా తెలియడం లేదు.
అయితే ఓ ఛానల్ తో మాత్రం టచ్ లోకి వెళ్లారు పోసాని. తన ఇంటిపై రాళ్లదాడి చేసింది పవన్ కల్యాన్ అభిమానులేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు తిడుతున్నారని అడిగితే దాడి చేస్తారని, పవన్ కల్యాణ్ లాంటి సైకోలు రాజకీయాలకు పనికిరారని, పవన్ ఊసరవెళ్లి రాజకీయాలపై ప్రశ్నిస్తే సైకో ఫ్యాన్స్ దాడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు పోసాని.