పోసాని కృష్ణమురళి అంటే ఒక ఫైర్ బ్రాండ్ అని ఇప్పటికే ఇండస్ట్రీ లో ఓ టాక్ ఉంది. అలాంటి పోసాని నటుడు భరత్ మరణం పై నోరు విప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది.
ఒక ఛానల్ వారు ఆయనతో భరత్ కి ఉన్న సాన్నిహిత్యం గురించి అలాగే భరత్ ఆఖరి చూపుకి రవితేజ కుటుంబ సభ్యులు రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని అడగారు.
ఇక పోసాని మాట్లాడుతూ- చాలా ఏళ్ళ క్రితం భరత్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి తాను సహాయం చేసినట్టు తద్వారా ఆయన ఉద్యోగం కూడా పోగొట్టుకున్నట్టు చెప్పాడు. తాను అలా సహాయం చేసినందుకు, భరత్ తనని చాలా గౌరవించేవాడని తెలిపాడు.
భరత్ తన అన్న రవితేజ తో కన్నా తనతోనే బాగా సన్నిహితంగా ఉండేవాడని అలాగే తనతో చాలా సార్లు ఫోన్లో మాట్లాడేవాడు అని కూడా చెప్పారు. అయితే భరత్ గురించి తను రవితేజ తో మాట్లాడినప్పుడు, భరత్ ప్రవర్తన మార్చుకోకపోతే తను మాత్రం ఎలా అతనికి అండగా ఉంటాను అని చెప్పినట్టు ఛానల్ వారికి చెప్పారు పోసాని.
ఇక భరత్ ఆఖరి చూపుకి రావడం రాకపోవడం రవితేజ వ్యక్తిగతం అని ఆ విషయం పై తను స్పందించడం కరెక్ట్ కాదు అని స్పష్టంచేశాడు.