ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న జైలవకుశ చిత్రానికి సంబంధించిన కథ లీక్ అయిందంటూ పుకార్లు మొదలయ్యాయి.
ఈ చిత్రం ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య సాగే భావోద్వేగ కథ అని, సవతి తమ్ముల పై పగ తీర్చుకునే యాక్షన్ ఎంటర్టైనర్ ఈ చిత్రం అని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా సోదరులలో పెద్దవాడిగా జై నటన ఈ చిత్రానికే హైలైట్ అని అలాగే ఈ పాత్రకి ఒక ప్రత్యేక బాడీ లాంగ్వేజ్ ఉంటుందట.
అయితే దాదాపు అన్ని పెద్ద చిత్రాల విడుదలకు ముందు ఇటువంటి కథ లీక్ అయిందంటూ పుకార్లు రావడం, వాటితో పాటు ఏవేవో కథలు బయటకి రావడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయింది.
మరి ఇప్పుడు లీక్ అయిన కథ ఒట్టి ఊహల్లో పుట్టిందా లేక నిజంగా జైలవకుశ చిత్రానికి సంబంధించినదేనా అనే విషయం తెలియాల్సివుంది.