సినీ రచయిత, నటుడు, దర్శకుడు అయిన పోసాని కృష్ణమురళి మరోసారి తనదైన శైలిలో పొలిటికల్ పంచులు వేసాడు. ఈ సారి ఆయన టార్గెట్ చేసింది TDP పార్టీని, అయితే ఆయన TDP పైన సెటైర్ వేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచేశాడు.
దానికి కారణం- మొన్న TDP MLC ఒకరు మాట్లాడుతూ- సినీపరిశ్రమ వారు AP స్పెషల్ స్టేటస్ విషయంలో తమతో కలిసి రావట్లేదు అని ఇలా చేయడం బాధ్యత రాహిత్యం అని ఇలానే గనుక చేస్తూ ఉంటే AP ప్రజలు తప్పక వెలివేస్తారు అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
దీనికి కౌంటర్ గా పోసాని జవాబు ఇస్తూ- కేవలం 10రోజుల క్రితం వరకు స్పెషల్ స్టేటస్ సంజీవిని కాదు అని ప్యాకేజ్ చాలు అన్న మీరు రాత్రికి రాత్రి మాట మారిస్తే మీ వెనకాల మేము రావాలా అని సెటైర్ వేశారు. అసలు సిసలైన లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం KCR అని, తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం అయ్యాడు అని అంతే తప్ప ఇలా రోజుకొక మాట మార్చలేదు అని KCR పైన పొగడ్తలు కురిపించాడు.
మొత్తానికి TDPకి కౌంటర్ గా TRS అధినేతకి పోసాని జేజేలు కొట్టాడు.