ఈమధ్యకాలంలో సినీ పరిశ్రమలో ముఖ్యంగా దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ల గురించిన వ్యక్తిగత విషయాలు అలాగే వారి ప్రేమాయణాల గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి.
ముఖ్యంగా సుచి లీక్స్ అలాగే తరువాత పలువురు నటీమణులు కూడా చిత్రపరిశ్రమల్లో ఉండే వేధింపుల గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయడం కూడా చూసాము. అయితే వీటన్నిటినీ పక్కకి జరుపుతూ నిన్న ఒక ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య అయిన నేహా చేసిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఆ ట్వీట్ల సారాంశమేమిటంటే- ఈరోజుల్లో ఉన్న నటీమణులు వేరే వారి జీవితాలని నాశనం చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోలని, నిర్మాతలని ఆకర్షిస్తూ వారి కుటుంబాలని నాశనం చేస్తున్నారు అంటూ ట్వీట్ పెట్టడంతో అందరు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
అయితే ఈ ట్వీట్లని వెంటనే డిలీట్ చేసిన నేహా. తాను ఇలా ట్వీట్ చేయడం వల్ల కొంత విమర్శలు కూడా రావడం వల్లె ఆ ట్వీట్లని తీసేసాను అని కాకపోతే ఆ వివరాలని మాత్రం త్వరలోనే భయటపెడతాను అని చెప్పుకొచ్చింది.
ఇక ఇలా నష్టపోయిన వారి జాబితాలో తాను లేను అని తన కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేవు అని తన చుట్టూ ఉన్నవారి జీవితాలని చూసాకనే ఈ ట్వీట్ చేశాను అని చెప్పింది.
ఏదేమైనా ఒక ప్రముఖ నిర్మాత భార్య ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.