‘దేవర’ విజయం తర్వాత ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టులను ఆసక్తికరంగా ఎంపిక చేసుకుంటున్నాడు. వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలకు కమిట్ అవుతున్న ఆయన, ప్రేక్షకులను మళ్ళీ అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ లో నటిస్తున్నారు, ఇది 2025 ఆగస్టులో విడుదల కానుంది.
అదే సమయంలో, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్ మొదలుపెట్టారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. వీటితో పాటు, ఎన్టీఆర్ కొత్త కథలను కూడా వింటున్నాడు.
తాజాగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌తో ఎన్టీఆర్ చర్చలు జరిపినట్లు సమాచారం. గతంలో ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన నెల్సన్, ఎన్టీఆర్ కోసం ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు తుదిదశలో ఉన్నాయని, అధికారిక అనౌన్స్‌మెంట్ కూడా త్వరలో రానుందని టాక్.
ఈ చిత్రానికి ‘ROCK’ అనే హై-వోల్టేజ్ టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నెల్సన్ ‘జైలర్ 2’ తెరకెక్కిస్తున్నప్పటికీ, అన్ని ప్లాన్స్ ప్రకారం జరిగితే, 2026లో ఎన్టీఆర్ - నెల్సన్ కాంబినేషన్ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ఫాన్స్ మాత్రం ఈ కాంబోపై అంచనాలు భారీగా పెంచుకున్నారు.