ప్రజంట్ నడుస్తున్న ట్రెండ్ కి అనుగుణంగా టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్లు తెరపైకి వస్తున్నాయి. సౌత్ డైరక్టర్స్, హీరోలు ఏకమై క్రేజీ కాంబినేషన్స్ తో అంచనాలు పెంచేస్తున్నారు. బాలీవుడ్ దర్శకులు కూడా మన టాలీవుడ్ హీరోల కోసం వెయిట్ చేస్తున్నారు. సౌత్ దర్శకులు ఒకప్పుడు బాలీవుడ్ హీరోలతో వర్క్ చేయటం డ్రీమ్ లా భావించేవారు. కానీ ఇప్పడు సౌత్ హీరోలతో సినిమాలు చేసి బాలీవుడ్ లో హిట్ కొడుతున్నారు. ఇప్పటికే జక్కన్న, ప్రశాంత్ నీల్, సుకుమార్, బోయపాటి, ప్రశాంత్ వర్మ, కొరటాల లాంటి పాన్ ఇండియా దర్శకులు సత్తాచాటుతున్నారు.
ప్రస్తుతం పాన్ ఇండియా దర్శకులలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు నీల్, నెక్స్ట్ ప్రభాస్ తో సలార్ 2 తెరకెక్కించనున్నాడు. తరువాత ఏంటి అంటే బన్నీతో సినిమా చేయనున్నాడట. అవును ఈ క్రేజీ ప్రాజెక్ట్ గూర్చి విన్న ఫాన్స్ అప్పుడే పూనకాలు లోడింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రశాంత్ నీల్ లాంటి క్రేజీ డైరక్టర్ తో బన్నీ వర్క్ చేస్తే పుష్ప లాంటి హిట్ గ్యారంటీ అని ఫాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ మూవీని దిల్ రాజు నిర్మించనున్నారట.
'గేమ్ చేంజర్' ఫ్లాప్ నేపథ్యంలో దిల్ రాజుకి నష్ఠాలు రాగా, బన్నీ హామీ ఇచ్చాడని, అదే ఇప్పడు ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ అని టాక్. గతంలో ప్రశాంత్ నీల్ దిల్ రాజుకి ఒక మూవీ బాకీ ఉన్నాడని, ఇప్పడు బన్నీతో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాకపోతే బన్నీ -నీల్ కాంబో మూవీ కొంచెం టైం పట్టొచ్చు అని సమాచారం. నీల్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ. బన్నీ కూడా అట్లీ, త్రివిక్రమ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు . ఇవి కంప్లీట్ అయ్యాక ఈ క్రేజీ కాంబో స్టార్ట్ కానుంది అని తెలుస్తోంది.