ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఇటీవలే ఈ సినిమా విదేశాల్లో ఓ ఇంపార్టెంట్ షెడ్యూల్ షూటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ సహా టీవ్‌ు అంతా సెల్ఫ్ క్వారంటైన్ మోడ్‌లోకి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే సంగతి. పూజా హెగ్దే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా కోసం ఓ సూపర్బ్ ఐటమ్ సాంగ్‌ని ప్లాన్ చేస్తున్నారట.
ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్ కోసం ఓ ప్రముఖ హీరోయిన్‌ని రంగంలోకి దించాలనే ఆలోచనలో చిత్ర దర్శక నిర్మాతలు వున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ బాలీవుడ్ నటితో ఇప్పటికే సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చాయనే ప్రచారం జరుగుతుండగా, టాలీవుడ్‌లోకే చెందిన ఓ పాపులర్ హీరోయిన్‌ని కూడా ఒప్పించినట్లు మరో ప్రచారం తెరపైకొచ్చింది. ఆ ప్రముఖ హీరోయిన్ గతంలో ప్రభాస్ సరసన ఓ సూపర్ హిట్ సినిమాలో నటించిందట కూడా. ఇంతకీ ఎవరామె.? టాలీవుడ్ జనాలకి సుపరిచితురాలైన ఆ బ్యూటీనే ఐటమ్ భామగా ఫిక్స్ చేస్తారా.? బాలీవుడ్ భామ రంగంలోకి దిగుతుందా.? కొద్ది రోజుల్లోనే ఈ విషయమై స్పష్టత రాబోతోందట.