నందమూరి బాలకృష్ణ అంటే కమిట్‌మెంట్‌కీ డెడికేషన్‌కీ కేరాఫ్ అడ్రస్. తన తాజా సినిమా కోసం బాలకృష్ణ డిఫరెంట్ గెటప్‌లో కన్పించనున్న సంగతి తెల్సిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందనున్న సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌కి బ్రేక్ వచ్చేసింది. ఈలోగా బాలయ్య ఏం చేస్తున్నాడు.? దర్శకుడు బోయపాటి పరిస్థితేంటి.? ఇలా రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. స్క్రిప్ట్‌లో బెటర్‌మెంట్స్ చేసేందుకు సమయం దొరికిందంటూ బోయపాటి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. మరోపక్క, నందమూరి బాలకృష్ణ ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టాడట. కరోనా లాక్‌డౌన్‌ని ఫుల్లుగా వాడేసుకుంటూ, సీరియస్ వర్కవుట్స్ చేసేస్తున్నాడట బాలయ్య.
‘బోయపాటి సినిమాలో బాలయ్య కొత్త లుక్‌తో కన్పించబోతున్నారు. అంతే కాదు, ఫిజిక్ పరంగా బాలయ్యకు ఇది కంప్లీట్ న్యూ లుక్..’ అని చెబుతున్నారు. మరీ సిక్స్ ప్యాక్ లాంటివి కాదుగానీ, బాలయ్య ఇంతకు ముందెన్నడూ లేనంత ఫిట్‌నెస్‌తో ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. ఇందుకోసం ఓ ట్రైనర్ సాయంతో (ఆన్‌లైన్ ద్వారా) బాలయ్య వర్కవుట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బోయపాటి సినిమాలంటే యాక్షన్ సీక్వెన్సెస్‌కి వుండే ప్రత్యేకతే వేరు. బాలయ్య ఇంత సీరియస్‌గా వర్కవుట్స్ చేసేస్తోంటే, సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఔట్‌పుట్ ఇంకెంత అద్భుతంగా వుంటుందో ఊహించుకోవచ్చు.