‘ప్రభాస్‌-20’ ఫొటోలొచ్చాయ్‌గానీ.!

మరిన్ని వార్తలు

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రభాస్‌20’ సినిమాకి సంబంధించి కొన్ని స్టిల్స్‌ని చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా విడుదల చేసింది. అయితే, ఇవి ఎప్పుడో జరిగిన పూజా కార్యక్రమానికి సంబంధించినవి. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం విదితమే. కాగా, అభిమానులు చాలాకాలంగా సినిమా టైటిల్‌ గురించి ఎదురు చూస్తున్నారు. ఉగాదికి ఈ సినిమా టైటిల్‌ లుక్‌ రిలీజ్‌ అవుతుందని అంతా ఎదురుచూశారు. అయితే, కరోనా వైరస్‌ నేపథ్యంలో అది వీలు కాలేదు. తాజాగా ఈ రోజు ‘ప్రభాస్‌20’ నుంచి ఓ అప్‌డేట్‌ వస్తుందనే ప్రచారం జరిగింది.

 

చివరికి చిత్ర నిర్మాణ సంస్థ కొన్ని ఫొటోల్ని విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఈ ఫొటోలకు బదులుగా ఆన్‌ లొకేషన్‌ స్టిల్స్‌ (వర్కింగ్‌ స్టిల్స్‌) విడుదల చేసినా బావుండేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ‘సాహో’ రిజల్ట్‌ తర్వాత ‘ప్రభాస్‌20’ కోసం కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఆ కారణంగానే సినిమా నిర్మాణంలోనూ జాప్యం జరుగుతోందన్న ప్రచారం విన్పిస్తోంది. కారణాలేవైనా, ప్రభాస్‌ అభిమానులు మాత్రం ఈ ఆలస్యంతో నిరాశ చెందుతున్నారు. ఈ ఏడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు దాదాపుగా కన్పించడంలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS