ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. యూవీక్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధాకృష్ణ దర్శకుడు. ఈ చిత్రానికి `రాధే శ్యామ్` అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు ఉదయం సరిగ్గా 10 గంటలకు ఫస్ట్ లుక్ వచ్చింది. కథానాయిక పూజా హెగ్డేతో పాటు ప్రభాస్ - రొమాంటిక్ పోజ్‌లో దర్శనమిచ్చాడు.
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నిజానికి ప్రభాస్ సోలో ఎంట్రీ ఊహించారు అభిమానులు. కానీ ఇది లవ్ స్టోరీ కదా. అందుకే హీరోయిన్ తో పాటు జంటగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ డిజైన్ చేసిన పద్ధతిలోనే.. కథ చూచాయిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇటలీలో కొంతమేర షూటింగ్ జరిపారు. మిగిలిన భాగాన్ని హైదరాబాద్ లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వారంలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.