ప్రభాస్20: ఆ భామ పాత్ర ఏంటో తెలిసిపోయిందోచ్

By Inkmantra - July 10, 2020 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ & టైటిల్ జులై 10 వ తారీఖున విడుదల కానుందనే సంగతి అందరికీ తెలిసిందే. #ప్రభాస్20 గా ఇప్పటివరకూ పిలుచుకుంటున్న ఈ సినిమాకు 'రాధే శ్యామ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

 

ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. పూజ తో పాటుగా మరో బ్యూటీ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఆ ఆమ్మాయి పేరు సాషా ఛెత్రి. ఎయిర్ టెల్ అడ్వర్టైజ్ మెంట్ తో అందరి హృదయాలను కొల్లగొట్టిన ఈ గ్లామర్ రాణి ఈ సినిమాలో పూజకు చెల్లిగా నటిస్తోందని సమాచారం. మరదలు టైపు పాత్ర కాబట్టి ఆరడుగుల బావను ఆటపట్టిస్తూ హంగామా చేస్తుందా అనేది మాత్రం సినిమా విడుదల అయితే కానీ తెలియదు.

 

ఈ సినిమా కథ 1960 ల నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీ అని ఇప్పటికే టాక్ ఉంది. వరసగా యాక్షన్ చిత్రాలు చేస్తున్న ప్రభాస్ ఇలా లవ్ స్టోరీలో అదీ ఓ అరవై ఏళ్ల నాటి నేపథ్యం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS