బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. తనవన్నీ ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్టులే. తనతో సినిమా చేయడానికి టాప్ మోస్ట్ డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. త్వరలో ప్రభాస్ 25వ సినిమా మైలు రాయిని చేరుకోబోతున్నాడు. ఈ చిత్రం సమ్ థింగ్ స్పెషల్ గా ఉండానలన్నది ప్రభాస్ ఉద్దేశ్యం. అందుకే ఆ మైల్ స్టోన్ మూవీ గురించి ముందు నుంచీ ప్లానింగ్ చేసుకుంటున్నాడు.
ఈ సినిమాని ఎవరి చేతుల్లో పెడితే బాగుంటుంది? అనే విషయంలో ప్రభాస్ చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాడు. `ఆ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం మాకు ఇవ్వండి` అంటూ కొంతమంది దర్శకులు కూడా ప్రభాస్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఛాన్స్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ చేతికి చిక్కిందని తెలుస్తోంది. కేజీఎఫ్ తో సంచలనం సృష్టించాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2 పూర్తి కాకముందే.. ప్రభాస్ తో `సలార్`ని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు.
త్వరలో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ మరో సినిమా చేయబోతున్నాడని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే ఇప్పుడు ఖాయమైంది కూడా. ప్రభాస్ తన 25వ సినిమాకి దర్శకుడిగా ప్రశాంత్ ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. సలార్ షూటింగ్ సమయంలో.. ప్రభాస్ కి మరో అద్భుతమైన కథ చెప్పాడట ప్రశాంత్. దానికి ప్రభాస్ ఫిదా అయిపోయాడని తెలుస్తోంది. ఆ మూవీ `బాహుబలి`ని మించి ఉంటుందని, కనీసం మూడేళ్ల పాటు సాగే సుదీర్ఘమైన ప్రాజెక్టు ఇదని సమాచారం. సో.. ప్రభాస్ 25వ సినిమాకి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాడన్నమాట.