ప్రభాస్ 25వ సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. స్పిరిట్ అనే వెరైటీ టైటిల్ పెట్టారు. ఇది ఓ రకంగా పాన్ వరల్డ్ మూవీ. ఎందుకంటే చైనీస్, జపనీస్ భాషల్లోనూ ఈ సినిమాని నేరుగా విడుదల చేస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈసినిమాలో ప్రభాస్ కనీ వినీ ఎరుగని పాత్రలో కనిపించబోతున్నాడు. వివరాల్లోకి వెళ్తే...
స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడన్నది టాక్. ప్రభాస్ ప్రభాస్ సిక్స్‌ప్యాక్ బాడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పర్‌ఫెక్ట్ గా సూటవుతుంది. కానీ ప్రభాస్ ని ఎవ్వరూ, ఒక్కసారి కూడా పోలీస్ ఆఫీసర్ గా చూపించలేదు. ప్రభాస్ ని పోలీస్ గా చూడాలన్నది ఆయన అభిమానుల కోరిక కూడా. ఎట్టకేలకు ఈ కోరిక తీరబోతోంది. మాదక ద్రవ్యాల ముఠా చుట్టూ సాగే కథ ఇదని, ఆ ముఠాని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపిస్తాడని ఓ ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకూ నిజం? అన్నది ఇంకా తెలీదు. కాకపోతే.. ఇది మహేష్ కోసం రాసుకున్న కథ. గతంలో మహేష్ బాబు - సందీప్ రెడ్డి వంగా కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. అదే కథని ప్రభాస్ కోసం కొంత మార్చి తీస్తున్నాడని ఇండ్రస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.